This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

రొమ్ము ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

Women Specific Issues
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 19, 2026
రొమ్ము ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
Likes16 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • మాస్టిటిస్ అనేది తల్లిపాలిచ్చే మహిళలలో సాధారణంగా వచ్చే రొమ్ము ఇన్ఫెక్షన్, ఇది పాలు పేరుకుపోవడం లేదా చనుమొనలలో పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఏర్పడుతుంది.
  • రొమ్ము ఇన్ఫెక్షన్ యొక్క సాధారణ లక్షణాలు రొమ్ముల నొప్పి, ఎర్రదనం, వాపు, దద్దుర్లు, చనుమొన నుండి స్రావం, జ్వరం, వణుకు మరియు చంకలలో శోషరస గ్రంథుల వాపు.
  • మాస్టిటిస్ చికిత్సలో సాధారణంగా 7-14 రోజుల యాంటీబయాటిక్స్ కోర్సు, నొప్పి నివారణ మందులు ఉంటాయి, తల్లిపాలు ఇవ్వడం కొనసాగించడం ఇన్ఫెక్షన్ తొలగించటానికి సాయపడుతుంది.
  • రొమ్ము సంరక్షణకు ఏ ఉత్పత్తులు సాయపడతాయి? Explore our Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2.
Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
Rating4.8
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

చాలామంది పాలిచ్చే తల్లులు ఈ బాధాకరమైన, అసౌకర్య పరిస్థితి అయిన రొమ్ములలో ఇన్ఫెక్షన్ సమస్యని తమ జీవితంలో ఒక్కసారైనా ఎదుర్కొంటారు. ఇవాళ ఈ ఆర్టికల్, ఈ పరిస్థితికి కారణమేమిటో, దాని సాధారణ లక్షణాలు, చికిత్స అలాగే దానిని ఎలా సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చో వివరిస్తుంది.

మాస్టిటిస్ అంటే ఏమిటి?

మాస్టిటిస్ గా కూడా పిలవబడే రొమ్ము ఇన్ఫెక్షన్ సమస్య తల్లిపాలని ఇస్తున్న మహిళలలో రావచ్చు. రొమ్ములలో పాలు పేరుకుపోవటం కారణంగా ఇది ఏర్పడి రొమ్ములో ఇన్ఫెక్షన్గా మారుతుంది. మాస్టిటిస్ అనేది తల్లిపాలని ఇస్తున్న మహిళలో సాధారణంగా వచ్చే రొమ్ము ఇన్ఫెక్షన్, కానీ తల్లిపాలు ఇవ్వని మహిళలకి కూడా ఇది సంక్రమించవచ్చు. మాస్టిటిస్ యొక్క లక్షణాలు రొమ్ములలో నొప్పి, ఎర్రదనం, ఇంకా వాపు. తల్లి పాలిస్తున్నప్పుడు ఆమె చనుమొనలలో పగుళ్ల ద్వారా పసిబిడ్డ నోటి నుండి తల్లి రొమ్ములోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వలన సాధారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పాల నాళాలు మూసుకుపోతే కూడా మాస్టిటిస్ రావచ్చు. మాస్టిటిస్ చికిత్సలో సాధారణంగా యాంటీబయాటిక్స్ వాడతారు అలాగే నొప్పి నివారణకి మందులు ఇస్తారు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ము స్వీయ పరీక్ష అంటే ఏంటీ? రొమ్ము స్వీయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి?

రొమ్ము ఇన్ఫెక్షన్ యొక్క సాధారణ లక్షణాలు

మహిళలలో రొమ్ముల ఇన్ఫెక్షన్ కి సంబంధించిన చాలా రకాల లక్షణాలని గమనించవచ్చు. అత్యంత సాధారణ లక్షణం రొమ్ములో తరచూ మంటగా అన్పిస్తూ వచ్చే నొప్పి. మరికొన్ని సాధారణ మాస్టిటిస్ లక్షణాలు కింద ఇవ్వబడ్డాయి:

  • రొమ్ముపై దద్దుర్లు
  • రొమ్ము వాపు
  • రొమ్ముపై దురద
  • నిపిల్ ఇన్ఫెక్షన్/చనుమొన నుండి ఏదైనా స్రావం
  • రొమ్ము చాలా సున్నితంగా మారటం
  • జ్వరం మరియు వణుకు
  • చంకలలో శోషరస గ్రంథుల వాపు

రొమ్ము ఇన్ఫెక్షన్ కి కారణాలు

రొమ్ములలో ఇన్ఫెక్షన్ లేదా మాస్టిటిస్ రావడానికి కొన్ని విభిన్న కారణాలు ఉంటాయి. చాలా సాధారణంగా వచ్చే మాస్టిటిస్ కి కారణం బ్యాక్టీరియా (స్టెఫైలోకోకస్ ఆరియస్) అని చెప్పవచ్చు, ఈ బ్యాక్టీరియా రొమ్ములోకి చనుమొన వద్ద ఉండే పగుళ్ల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది చనుమొన పగిలినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు లేదా మీ బిడ్డ దానిని సరిగ్గా నోటిలో పెట్టుకోనప్పుడు జరగవచ్చు. రొమ్ములలో ఇన్ఫెక్షన్ కి ఇతర కారణాలు మూసుకుపోయిన పాల గ్రంథి లేదా స్తనానికి తగిలిన ఏదైనా గాయం. కొన్నిసార్లు బయటి ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, అంటే దుస్తుల వంటివి కూడా ఇన్ఫెక్షన్ కి కారణమవుతాయి. ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానం కలిగినట్లయితే, డాక్టరు లేదా లాక్టేషన్ కన్సల్టెంట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంప్రదించడం ముఖ్యం. వారు మీకు ఇన్ఫెక్షన్ తొలగించటంలో సాయపడే మాస్టిటిస్ యాంటీబయాటిక్స్ సూచిస్తారు.

రొమ్ముల ఇన్ఫెక్షన్ నిర్ధారణ పరీక్ష

చాలావరకు కేసులలో, రొమ్ములలో ఇన్ఫెక్షన్ని డాక్టరు సులభంగా గుర్తించి నిర్థారిస్తారు. వారు మిమ్మల్ని లక్షణాల గురించి అడగవచ్చు అలాగే శరీరాన్ని కూడా పరీక్ష చేస్తారు. రొమ్ము క్యాన్సర్ లేదా చీముగడ్డలలాంటి ఇతర కారణాల యొక్క లక్షణాలు లేవని ఖఛ్చితంగా నిర్థారించడానికి డాక్టరు మీకు మామోగ్రామ్, బయాప్సీ లేదా అల్ట్రాసౌండ్‌ని కూడా చేయించమని సూచించవచ్చు. స్తనం యొక్క కణజాలాన్ని పరిశీలించడానికి మామోగ్రామ్ ఎక్స్-రే కిరణాలను ఉపయోగిస్తుంది, అయితే బయాప్సీ కోసం స్తనం కణజాలం యొక్క చిన్న భాగం అవసరం. ఆ భాగంతో క్లినికల్గా ఏదైనా క్యాన్సర్ ఉందేమో, దానికి సంబంధించిన కణజాలం పెరుగుదల ఉందేమోనని పరీక్షిస్తారు.

రొమ్ము ఇన్ఫెక్షన్ చికిత్స ఎంపికలు

ఒకవేళ ఏ పేషెంటుకైనా రొమ్ములలో ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారణ అయితే వారికి సాధారణంగా యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తారు. ఈ యాంటీబయాటిక్ మందుల కోర్సు వ్యవధి 7 నుండి 14 రోజుల మధ్య ఎంతైనా ఉండవచ్చు. ఇవి ఇన్ఫెక్షన్ని తొలగించడానికి అలాగే లక్షణాల నుండి ఉపశమనానికి సాయపడతాయి. పేషెంట్లకి తేరుకున్నట్లు అన్పించినా కూడా, వారు యాంటీబయాటిక్స్ కోర్సును పూర్తి చేయాలి. ఒకవేళ ఎవరికైనా రొమ్ములలో ఇన్ఫెక్షన్ ఉంటే, తల్లిపాలు ఇవ్వడం కొనసాగించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది నిజానికి ఇన్ఫెక్షన్ని తొలగించి, మరలా ఎప్పుడైనా వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. కావాలంటే మీ బిడ్డకి ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా పాలని విడిగా పంపు చేసేసి మీ లక్షణాల నుండి ఉపశమనం పొందటం కూడా మరొక మార్గం. ఒకవేళ రొమ్ములలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటం వల్ల చీము గడ్డలు ఏర్పడితే, డాక్టరు ఆ మహిళ యొక్క స్తనాన్ని వేగంగా నయం చేయడంలో సహాయపడటానికి వైద్యపరంగా కోతపెట్టి చీముని బయటకి తీసివేయవలసి ఉంటుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా తల్లికి పాలివ్వడం చాలా బాధాకరంగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు పాలిచ్చే మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్ పంపును ఉపయోగించవచ్చు.


మీకు ఇది కూడా నచ్చుతుంది రొమ్ము నొప్పికి కారణాలు: ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి

ఇంటి వద్ద రొమ్ము ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తూ సంరక్షించడానికి టిప్స్

ఎవరైనా రొమ్ములలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే, ఆ లక్షణాలను తగ్గించడానికి అలాగే నయమవ్వడాన్ని వేగవంతం చేయడానికి ఇంట్లో మీరు చేయగల కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంట్లోనే రొమ్ములలో ఇన్ఫెక్షన్ల సంరక్షణకి సంబంధించి ఇక్కడ కింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి:

  • విశ్రాంతి తీసుకోండి, ఖంగారు పడవద్దు. ఇది ముఖ్యం ఎందుకంటే ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం ఎక్కువ పని లేకుండా నయం కావడంపై శ్రద్ధ పెడుతుంది.
  • ఇన్ఫెక్షన్ ప్రభావం ఉన్న ప్రదేశంలో వేడి కాపడం పెట్టండి. ఇది నొప్పి ఇంకా వాపుని తగ్గించడంలో సాయపడుతుంది.
  • వదులైన, సౌకర్యవంతమైన బట్టలు వేసుకోండి. అవి చర్మంపై రాపిడి కలిగించకుండా చికాకుని తగ్గిస్తాయి.
  • ఇన్ఫెక్షన్ ప్రభావం ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి. ఇది ఇన్ఫెక్షన్ మరింత సోకకుండా, మంట రాకుండా నివారిస్తుంది.
  • ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోండి. ఇలా తాగుతూ ఉండటం వలన మీ శరీరంలో విషపదార్థాలు బయటకి వెళ్ళిపోయి మీ శరీరాన్ని హైడ్రేటడ్గా ఉంటుంది.
  • ఆరోగ్యకరమైన, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలనే తినండి. ఇవి మీ శరీరానికి నయం అవ్వటంలో సాయపడతాయి, ఇన్ఫెక్షన్తో పోరాడే బలాన్ని ఇస్తాయి.
  • అవసరమైతే ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే లభించే పెయిన్ కిల్లర్ మందులని తీసుకోండి. ఇవి మీరు అనుభవిస్తున్న నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
  • లక్షణాలు తగ్గకపోయినా, లేదా మరింత ఎక్కువైనా వెంటనే మీ డాక్టరుని సంప్రదించండి. వారు అవసరమైతే యాంటీబయాటిక్స్ ని సూచించవచ్చు.

ఈ టిప్స్ పాటిస్తే, కొత్తగా తల్లయిన లేదా అనుభవం ఉన్న మహిళలలో కూడా ఏ రకమైన రొమ్ములలో ఇన్ఫెక్షన్ వేగంగా నయమవుతూ, తగ్గిపోతుంది.

తల్లిపాలిచ్చే అమ్మలు ఎంచుకుంటున్న సంరక్షణ

మాస్టిటిస్ నొప్పిని తగ్గించి, ఆరోగ్యకరమైన బ్రెస్ట్ ఫీడింగ్ ప్రయాణానికి సహాయపడే సున్నితమైన ఉత్పత్తులు మీ కోసం.

Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2

Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2

BPA Free | Breast-Like Nipple | Food Grade Material | Wide Base for Better Latch | Can be Sterilized | Microwave Safe | Fits Most Standard Bottles

5762 Moms bought
₹59₹7925% Off
Rating
4.8
(118)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.